ఈ లాక్ డౌన్ లో పిల్లలతో గడిపే సమయం దక్కింది. ఈ సమయాన్ని నేను అక్షయ్ చక్కగా ఉపయోగించుకున్నామూ అంటోంది అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.ఎంత నచ్చజెప్పినా ఆన్లైన్ లో వాళ్ళు గడిపే సమయాన్ని తగ్గించలేక పోయాం అందుకే నేను అక్షయ్ వాళ్ల తో కలిసి పోయి ఆటలు ఆడటం మొదలు పెట్టాము.అక్షయ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది.మా పాప నిటారా కు ఆయన మెలుకువలు నేర్పడం ప్రారంభించారు. నేను పిల్లలతో లూడో వంటి ఆటలు పుస్తకాలు చదవటం అలవాటు చేయడం ప్రారంభించాను ఈ అలవాటు వాళ్లకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి అంటోంది ట్వింకిల్ ఖన్నా.పిల్లలకు జండర్ ఆధారంగా పనులు అప్పజెప్పలేదు వాళ్ల ఇష్టానికి తగ్గ పనులు చేయినిచ్చాం.మా అబ్బాయి ఆరవ్ కు అక్షయ్ కు వంటలు చేయటం లో ఆసక్తి వాళ్లు ఆ పనుల్లో మునిగిపోయారు.నేను ఇల్లు సర్దటం,సరుకులు తేవటం వంటివి చేశాను ప్రతిభ ఆసక్తి గమనించి పిల్లలకు పనులు అప్పగించాము అంటోంది ట్వింకిల్ ఖన్నా.

Leave a comment