గతంలో చిన్న అనారోగ్యలకు ప్రకృతి సిద్దమైన వనమూలికలు సాయంతో వైద్యం చేసుకునేవారు. ఇప్పుడు యువత ఇంటర్నెట్ వైద్యం చేసుకునేవారు. ఇప్పుడు యువత ఇంటర్నెట్ వైపు మళ్ళుతున్నారు.శరీరంలో చిన్న అనారోగ్య లక్షణం కనిపించగానే గబగబా గూగుల్ సెర్చ్ చేయడం దానికి ఏ మందు సూచించారో దాని కనుక్కుని వేసుకోవడం కొత్త ట్రెండ్. వైద్య చికిత్స అంటే దాని లక్షణాలు దానికి తగిన రెడిమెడ్ మందు కాదు.బక లాంటి లక్షణాలతో పలు రోగాలు వస్తాయి. కనుక రోగ నిర్దారణ చికిత్స విధానాల నిర్ణయం మెడిసిన్ చదివిన నిపుణులకు వదిలిపెట్టమని కాని అది మన పని కాదు. పైగా ఈ ఇంటర్నెట్ చికిత్సలు మరింత ప్రమాదం. రోగ నిర్దారణ శరీర స్థితి ,వయసు,గతంలో వచ్చిన అనారోగ్యాలు,గుండె కొట్టుకోవడం,ఇతర శారీరకమైన మార్పులు బట్టి ఉంటుంది. అంతేకానీ ఫలానా నొప్పికి ఫలానా టాబ్లెట్ అని నిర్ణయించుకుంటే చాలా ప్రమాదం.

Leave a comment