గంటల తరబడి వేసుకుంటేనే మేకప్ కాదు.ఐదే ఐదు నిమిషాల్లో అందంగా మేకప్ పూర్తి చేసుకోవచ్చు. ముందుగా చల్లని నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకోవాలి .తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ మృదువుగా ముఖానికి పూయాలి.చర్మంలో ఇది బాగా ఇంకాక ఫౌండేషన్ ఫేస్ బ్రష్ పై వేసి ముఖానికి,మెడ భాగానికి అప్లై చేయాలి.తరువాత ముఖానికి సరిపోయే ముదురు రంగు కన్సీలర్ ను  చిన్న బ్రష్ పై వేసుకొని నుదిటి పైన ముక్కుకు ఇరువైపులా సన్న గీతల్లా రాసి తర్వాత చిన్న  స్పాంజితో అది దీని పై లేత వర్ణం ఫినిషింగ్ పౌడర్ ను బ్రష్ తో రాస్తే చాలు.కంటి చుట్టూ నల్లని వలయాలు మాయమై కళ్లు విశాలంగా కనిపిస్తాయి.ఐబ్రో పెన్సిల్ తో కాటుక దిద్దుకొని కనురెప్పలకు మస్కారా దిద్దుకొని పెదవులకు లిప్ బామ్ రాసి లిప్ స్టిక్ వేసుకుంటే మేకప్ పూర్తయినట్లే.

Leave a comment