బాలీవుడ్ లో నటిస్తేనే గుర్తింపు వస్తుంది అనుకొనే వారు ,కానీ భాష ఏదైనా సినిమా బావుంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాలో నటించిన వారికి మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తుంది. దానికి నేనే పెద్ద ఉదాహరణ . భరత్ అనే నేను లో నటించక ముందు నేనెవరికీ తెలియదు కదా అంటోంది కియారా అద్వానీ.  నా మొదటి సినిమా ధోనీ చూశాక కొరటాల శివగారు నన్ను ఈ సినిమా కోసం పిలిచారు .కెరీర్ ప్రారంభంలోనే పెద్ద బ్యానర్ లో పెద్ద హీరోతో పనిచేయటం కంటే అదృష్టం ఏముంటుంది.   చిన్నప్పటి నుంచి కథక్ తో పాటు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. బాడీ ఫీట్ గా ఉంచుకొవచ్చు అలాగే పెయింటింగ్స్ వేయటం కూడా ఇష్టం. ఏం నేర్చుకొన్న ఇప్పుడు యాక్టర్ అయిపోయాను అందరికీ నచ్చేలా మంచి పాత్రలు చేస్తాను అంతే అంటుంది కియారా అద్వాణీ.

Leave a comment