Categories
మొక్కల పెంపకం ఇష్టమై, ఇంటి చుట్టూ కాస్తయినా చూటు లేకపోతె బోన్సాయ్ మొక్కల గురించి ఓ సారి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇంటి అలంకరణ లో బోన్సాయ్ ఒక ప్రత్యేకం. హలో అడుగుపెట్టగానే టేబుల్ పైన పళ్ళతో నిండిన బుల్లి ఆరెంజ్ మొక్క కనిపిస్తుంది. ఎలా వుంటుంది. కొన్ని రకాల బోన్సాయ్ మొక్కలకు అస్సలు ఎండ, వేడి తగలనే కూడదు. దాదాపు బోన్సాయ్ పెంచి పెంచి ఇచ్చే నర్సరీలున్నాయి. వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని చెట్టు కొమ్మలు, ఆకులు కత్తిరించే అవసరమైన పని ముట్లు ఇంట్లో పెట్టుకుంటే బోన్సాయ్ పెంపకం అంత కష్టం ఏమీ కాదు. పైగా మనకు తోట లేదనో, మొక్కలు పెంచే సాదరా తీరడం లేదనో బాధ తీరిపోతుంది. మంచి బోన్సాయి లి ఎంచి తెచ్చుకుంటే ఇల్లు ఉద్యానవనం రూపం తీసుకుని అందంగా అయిపోతుంది.