ఒక వెబ్ సైట్ పైన జరిగే వ్యాపారం. మెనూ హోమ్ కూక్డ్ దాని పేరు. హోటలంటూ వంటిల్లంటూ లేదు. రోజుకు వందా  నూట యాభై ఆర్దర్లుంటాయి. గెట్ టు గెదర్ లు పుట్టిన రోజులు , పెళ్లి రోజులు ఏవైనా వంటలు ఇంటికొస్తాయి. చాక్లేట్లు ,స్వీట్లు ,కుకీస్ ,డెజర్ట్లు ,బిర్యానీ వగైరాలు వండేందుకు ఈ స్టార్తప్ స్టార్ట్ చేసిన వైష్ణవీమేరెడ్డి ,కొంతమంది వంటలు బాగా చేయగల గృహిణులను ఇళ్లకు ఎంచుకుంది. వాళ్ళ వంటిల్లు శుభ్రత రుచి అన్నింటిని తెలుసుకుని చూసి జీ.కె అన్నాక వాళ్లందరికీ ఈ మెనూ హోమ్ కూక్డ్ కంపెనీ చెఫ్ లు. వాళ్ళ పేర్లు వివరాలు వెబ్ సైట్ తో ఉంటాయి. వైష్ణవి వ్యాపారం హైద్రాబాద్  లోనే  దిగ్విజయంగా సాగుతోంది. మంచి ఇంటి భోజనం తినాలనుకుంటే ఆర్దరిస్తే  చాలు. కర్రీ పాయింట్లు హోటళ్లు మర్చిపోవచ్చు.

Leave a comment