ఇప్పుడు కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇంట్లోంచి పని చేయటం ఇలాంటి సౌకర్యవంతమైన  జాబ్ చేయాలంటే కొని ఏర్పాట్లు చేసుకుంటే పని ఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఆఫీస్ పని అయితే సహాయకులు కావలిసినవి వేళకు అందిస్తారు. ఇంట్లో ఆ వెసులు బాటు ఉండదు కనుక తినేందుకు తాగేందుకు అన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఒకేసారి పని పూర్తి చేసేసి మిగతా పనులు చూ ద్దామనుకుంటే అలసి పోవటం తప్పదు.నియమితమైన వేళలో పనిచేయటం భోజనం ,అల్పాహారం సరైన వేళకి తీసుకోవటం మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అంటే ఫోన్ మాట్లాడటం సామజిక మాధ్యమాలు చూడటం కాదు ఏదైనా చదువుకోవటం చుట్టూ మనుషులతో మాట్లాడటం ఇవి ఉత్సాహం ఇచ్చే విశ్రాంతి లాంటివి. పనిచేసే గదిలో చక్కని సంగీతం వినివచ్చే ఏర్పాటు మంచి సువాసనలు రావటం పచ్చని చెట్లు పువ్వులు ఎదురుగ కనపడే ఏర్పాట్లు ఇవన్నీ మనసుని ఉత్తేజితం చేస్తాయి. ఉత్పాదకత పెరుగుతుంది.

Leave a comment