మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి  ఖర్చవుతోంది. శరీరం  ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ తోనే  ఉంటారు. ఇల్లు దుమ్ము దులిపితేనూ వ్యాక్యూమ్  క్లీన్ చేస్తేనూ ఇంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతి కందిన వందలాది పనులు చేస్తుంటేనూ  ఎక్సర్ సైజ్  చేసినట్టు కాదంటారు నిపుణులు . ఈ ఇంటి పనులన్నీ వారానికి 150 నిమిషాల తగు మాత్రం వ్యాయామం తో సాటిరావు. తాము చేసే ఈ పద్ధతి లేని పనుల వల్ల  కొవ్వు కరిగి శరీరం స్లిమ్ గా అవుతోందని ఊహించటం. శరీరం యధాతధంగా ఎప్పటిలా స్పూను కొవ్వు కూడా కరగకుండా ఉండటం చూసి దిగులుపడటం మామూలే. సైక్లింగ్ వాకింగ్ రన్నింగ్ తదితర వ్యాయామాలు పోలిస్తే ఇంటిపని ఎక్సర్ సైజ్ కిందకి రానే రాదు . ఉదాహరణకు 30 నిమిషాల వ్యాక్యూమింగ్ వల్ల  130 క్యాలరీలు ఖర్చయితే 30 నిముషాల సైక్లింగ్ వల్ల 400 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇంటి పనులు  శారీరిక చురుకుదనం ఇస్తాయి. కానీ వ్యాయామాలకు సమానం రావు.

Leave a comment