అందమైన లోహపు ఆభరణాలు చక్కని నవ్వుమొహంతో కనిపించే బోండా గిరిజన మహిళల జీవితం చాల ప్రత్యేకం . ఒడిసా ,ఛతీస్ గఢ్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని మత్కాన్ గిరి ఈ మహిళలది . వేట మొదలు వ్యవసాయం వరకు వీళ్ళదే బాధ్యత.  ఆమే ఇంటిపెద్ద . ఎదురు కట్నం ,పశువులు పొలం కానుకగా ఇచ్చి ,తమకంటే వయసులో చిన్నవాడిని వివాహం చేసుకొంటారు . సమస్యలొస్తే విడాకులు తీసుకొంటారు . కుటుంబ సమస్యలకు భర్తే కారణం అయితే అతను ఇంకోపెళ్లి చేసుకోకూడదని ఈ తెగ ఆచారం . సీతాదేవి ఇష్టదైవం . పెళ్ళి కాగానే శిరోజాలు తొలగించి పూసలు నారతో చేసిన తూరుబాని తలకు చుట్టుకుంటారు . సీతామాత ఇచ్చిందనే నమ్మకం తో ఒక నూలు వస్త్రం భుజం చుట్టూ కప్పుకొంటారు . మెడచుట్టూ లోహపు రింగులు చేతులకు అలాటి గాజులే వేసుకొంటే మంచి జరుగుతుందని నమ్ముతారు . మెడనిండా పూసల మాలలతో వంటినిండా పచ్చబొట్లు తో ఈ మహిళలు ఎంతో ప్రత్యేకం .

Leave a comment