వాటర్ ఆర్గ్ స్వచ్ఛంద సంస్థకు ఇండియా హెడ్ గా ఉంటుంది వేదిక భండార్కర్.మరుగుదొడ్ల నిర్మాణాలకు సూక్ష్మ రుణాలు అందిస్తుంది వాటర్ ఆర్గ్ సంస్థ.  ఇప్పటివరకూ కోటీ ఇరవై లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది.నీటి కనెక్షన్లు మరుగుదొడ్ల నిర్మాణాలకు ఈ సంస్థ సూక్ష్మ రుణాలు అందిస్తుంది.బ్యాంకింగ్ రంగంలో పాతిక సంవత్సరాలు అనుభవం ఉంది వేదిక భండార్కర్ కు జేపీ మోర్గాన్ సంస్థలో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.ముంబైలోని జై వకీల్ పౌండేషన్ లో వాలంటీర్ గా కొన్నాళ్ళు పనిచేసి మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకున్నారు వేదిక.అటు తరవాత వాటర్ ఆర్గ్ బాధ్యతలు తీసుకున్నారు వేదిక భండార్కర్.

Leave a comment