సౌదామినీ, మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు కనుక వాళ్ళ బలాలు, బలహీనతలు ఒకళ్ళకి ఒకళ్ళవి తలుస్తాయి. ఆలోచన ప్రవర్తన ఒకటి కాకపోయినా రక్తసంబంధం వల్ల అరమరికలు లేకుండా వుంటారు. జీవితంలో గడ్డు సమయంలో ఒకళ్ళకి ఒకళ్ళు అండగా వుంటారు. ఇద్దరూ ఒకే విలువలతో పెరుగుతారు. జన్యు పరమైన లక్షణాలు కామన్ గా వుంటాయి. ఒక్కోసారి కొన్ని సందర్భాలలో చుట్టూ వున్న విషయాలు అర్ధం చేసుకోవడంలో వున్న ఇబ్బందులు, అక్కచెల్లెళ్ళుగా వున్నవాళ్ళు పంచుకుని విశ్లేషించుకొంటారు. హాయిగా అరమరికలు లేకుండా కలిసి వుంటారు. సోదరి స్నేహితురాలైతే అంత కంటే లాభం, సంతోషం ఇంకేముంటుంది. ఎవరి ప్రపంచం వారిడిగా, ఎవరి చదువు,స్నేహితులు వేరువేరుగా పబ్లిక్ లైఫ్ ఉండొచ్చు. కానీ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ పర్స్ నల్ లైఫ్ ఇంట్లో వుంటుంది. ఇద్దరు ఎంతో సంతోషంగా తల్లిదండ్రుల ముద్దు బిడ్డలుగా ఆనందంగా వుండవచ్చు. పెద్దవుతూ ఉంటే అమ్మా స్థానం లోకి అక్క వచ్చి చేరుతుంటే ఇక వంటరి తనం ఏముంటుంది? ఇంట్లో ఇద్దరు తో బుట్టువులు వుంటే ఆనందమే ఆనందం!
Categories
Nemalika

ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళుంటే!

సౌదామినీ,

మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు కనుక వాళ్ళ బలాలు, బలహీనతలు ఒకళ్ళకి ఒకళ్ళవి తలుస్తాయి. ఆలోచన ప్రవర్తన ఒకటి కాకపోయినా రక్తసంబంధం వల్ల అరమరికలు లేకుండా వుంటారు. జీవితంలో గడ్డు సమయంలో ఒకళ్ళకి ఒకళ్ళు అండగా వుంటారు. ఇద్దరూ ఒకే విలువలతో పెరుగుతారు. జన్యు పరమైన లక్షణాలు కామన్ గా వుంటాయి. ఒక్కోసారి కొన్ని సందర్భాలలో చుట్టూ వున్న విషయాలు అర్ధం చేసుకోవడంలో వున్న ఇబ్బందులు, అక్కచెల్లెళ్ళుగా వున్నవాళ్ళు పంచుకుని విశ్లేషించుకొంటారు. హాయిగా అరమరికలు లేకుండా కలిసి వుంటారు. సోదరి స్నేహితురాలైతే అంత కంటే లాభం, సంతోషం ఇంకేముంటుంది. ఎవరి ప్రపంచం వారిడిగా, ఎవరి చదువు,స్నేహితులు వేరువేరుగా పబ్లిక్ లైఫ్ ఉండొచ్చు. కానీ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ పర్స్ నల్ లైఫ్ ఇంట్లో వుంటుంది. ఇద్దరు ఎంతో సంతోషంగా తల్లిదండ్రుల ముద్దు బిడ్డలుగా ఆనందంగా వుండవచ్చు. పెద్దవుతూ ఉంటే అమ్మా స్థానం లోకి అక్క వచ్చి చేరుతుంటే ఇక వంటరి తనం ఏముంటుంది? ఇంట్లో ఇద్దరు తో బుట్టువులు వుంటే ఆనందమే ఆనందం!

Leave a comment