ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఎన్నో చోట్ల క్రీములు నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటాయి.  బాత్ రూమ్స్ లో జెమ్స్ కి కొదవేలేదు టాయ్ లెట్ ప్రాంతం, ఫ్లోరింగ్ బాత్ టవల్స్ టూత్ బ్రష్ అన్నింటా బ్యాక్టీరియా వ్యాపించి ఉంటుంది. బ్రష్ ప్రతి రోజు వేడి నీటిలో ముంచాకే పళ్ళు తోముకోవాలి .సింక్ లో ఎక్కువ శాతం క్రిములు ఉంటాయి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కిచెన్ సింక్ లో ప్రతి రాత్రి వేడి నీళ్లు పోయాలి. ఇంట్లో ఉండే క్రిములు వల్లే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది ప్రమాదకరమైన ఫ్లోర్ క్లీనర్లే ముందుగా అనారోగ్యాలు తెస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి మంచి నీళ్ళతో కడిగి శుభ్రమైన పొడి బట్టతో ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలు.

Leave a comment