కొన్ని ఫేస్ పాక్ లు శ్రద్దగా ఇంట్లో చేసుకొంటేనే ఫలితం వెంటనే కనిపిస్తుంది. అన్ని చర్మానికి మేలు చేసేవిగా ఉండే పదార్థాలను తీసుకొంటే ముఖం మెరిసి పోతుంది. కొబ్బరి పాలు ,కలబంద గుజ్జు ,బియ్యం పిండి,కీరా దోసగుజ్జు ,కొబ్బరి నూనె ,పెరుగు ,ముల్తానీ మట్టి,అరటి పండు గుజ్జు,దానిమ్మ రసం ఇవన్ని గనక సిద్దం చేసుకొంటే చక్కని ఫేస్ పాక్ తయారై పోతుంది. వీటిలో కొబ్బరి పాలు,కలబంద గుజ్జు మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత తుడిచేస్తే ఈ మిశ్రమం మంచి క్లీనింగ్ లోషన్ లాగా పని చేస్తుంది. బియ్యం పిండి ,కీరదోస గుజ్జులు ,కొబ్బరి నూనెతో మొహం స్క్రబ్ చేసుకోవాలి.ఇప్పుడు ముఖం శుభ్రం చేసుకోని కాస్త ఆవిరిపట్టి పెరుగు,ముల్తానీ మట్టి ,అరటి పండు గుజ్జు ,దానిమ్మ రసంతో ఫేస్ పాక్ వేసుకొని అరగంట తర్వాత కడిగేస్తే ఇది ఫేషియల్ చేయించుకొన్న ఫలితం చూపెడుతోంది.

Leave a comment