అందరూ ఇష్టంగా తాగే జల్ జీర ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుదీనా ఒక కట్ట, నిమ్మరసం, ఉప్పు తగినన్ని నీళ్ళు, జీలకర్ర రెండు స్పూన్లు, కొత్తిమీర ఒక కట్ట, అల్లం కొద్దిగా పంచదార నాలుగు టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా తీసుకుని పుదీనా కొత్తిమీర శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర వేయించుకోవాలి మిక్సీలో పుదీనా కొత్తిమీర చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. వేయించిన జీలకర్ర అల్లం కలిపి మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఇంగువ ఉప్పు నిమ్మరసం వేసి ఇంకోసారి బ్లెండ్ చేయాలి. జాలి లో వడబోసి ఐస్ క్యూబ్స్ వేస్తే చాలా చల్లని డ్రింక్ రెడీ అయిపోతుంది.

Leave a comment