కరోనా భయంతో ఇల్లు కదిలి ఏ పార్లర్ కో  స్పా కో  వెళ్ళలేని పరిస్థితి .ఇంటి దగ్గరే కొన్ని టిప్స్ పాటిస్తే పార్లర్లో సర్వీస్ తీసుకున్నట్లు అవుతుంది.ఓట్స్ తేనే యాగర్ట్  కలిపిన మిశ్రమాన్ని ముఖంపైన స్క్రబ్బర్ లా రుద్దుకుంటే ముఖంపైన మృతకణాలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.బ్లాక్ టీ జుట్టుకు పట్టిస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. కొద్దిసేపు వేడినీళ్ళలో చేతులు పాదాలు ఉంచితే ఇన్ ఫ్లమేషన్ పోతుంది కండరాల అలసట మాయం అవుతోంది.అలాగే అవాంఛిత రోమాలను తొలగించేందుకు నిమ్మరసం నీళ్లు చక్కెర కలిపి రోమాలు ఉన్న చోట ప్యాక్ వేసి కాసేపు తొలగిస్తే ప్యాక్  తో పాటు వెంట్రుకలు కూడా వచ్చేస్తాయి.

Leave a comment