మార్కెట్ లో ఎన్నో రకాల స్క్రబ్ లు దొరుకుతాయి . వీటిని ఇంట్లో కూడా సులువుగా తాయారు చేసుకోవచ్చు . గులాబీ ఫ్లేవర్ స్క్రబ్ కావాలి అనుకొంటే ,కొబ్బరి నూనెలు,సి సాల్ట్ ,రోజ్ ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలుపుకొంటే చక్కని స్క్రబ్ తయారవుతుంది . అలాగే నారింజ సువాసన కోసం మూడుకప్పుల చక్కర ,కప్పు ద్రాక్షగింజల నూనె ముప్పావు కప్పు నారింజ ఎసెన్షియల్ ఆయిల్ . పావు కప్పు పుదీనా ఎసెన్షియల్ నూనె వేసి బాగా కలిపి సీసాలో భద్రపరుచు కొంటే ప్రతిరోజు చర్మం మెరిసిపోయెలా స్క్రబ్ చేసుకోవచ్చు . ముఖం పై మృత కణాలు ముక్కు గడ్డం,చుట్టు నలుపు ఉంటె ,టేబుల్ స్పూన్ తేనెలో ,రెండు స్పూన్ల చక్కర ని కలుపుకొని ,అప్పటికప్పుడే ఫ్రెష్ గా ముఖం పైన రుద్దితే చర్మం మృదువుగా అయిపోతుంది నలుపు నెమ్మదిగా తగ్గిపోతుంది .

Leave a comment