అరోవిలే సంస్థలో హెర్బల్ లిస్ట్ గా పనిచేస్తూ వేలాది మందికి ఔషధ మొక్కలపై అవగాహన కల్పిస్తూ మౌలిక విలువ పట్ల ఆసక్తి కలిగిస్తోంది పార్వతి నాగరాజ్.తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని నల్లూరు గ్రామంలో పుట్టింది పార్వతి.ఆమె కుటుంబీకులు మూలికా వైద్యంలో సిద్ధహస్తులు.అరోవిలే సంస్థ పిచ్చాండికులం ఫారెస్ట్ పేరుతో వనమూలికల అభివృద్ధిని చేపట్టి వందల ఎకరాల్లో ఔషధ మొక్కలను పెంచుతోంది ఆ సంస్థ తాము నిర్వహించే పి.హెచ్.సి లో వైద్య సిబ్బందికి వనమూలికల పై శిక్షణ ఇచ్చే బాధ్యతను పార్వతికి అప్పగించింది.అప్పటి నుంచి హెర్బలిస్ట్ గా అడవిలోని 800 రకాల ఔషధ మొక్కల పై ఆమె పాఠాలు చెబుతోంది. ఈమె సేవలకు గాను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇండియా బయో డైవర్సిటీ అవార్డ్ తో సహా ఇంకెన్నో అవార్డులు వచ్చాయి.