గిరిజనుల కల్పవృక్షంగా భావించే ఇప్ప పూల చెట్టు, ఆకులు, బెరడు, పువ్వులు, కాయలు అన్నింటి లోను పోషక విలువలు ఎక్కువే ముఖ్యంగా పువ్వుల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజలవణాలు, పీచు, కాల్షియం, పాస్పరస్, కెరోటిన్, విటమిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాలింతల్లో పాలు వృద్ధి కావడానికి ఇప్పపూల పొడి కలిపి ఇస్తారు. ఈ పూలు మరిగించి చల్లార్చిన కషాయం తాగితే అతి దాహం తగ్గుతుంది. ఇప్ప పూల తో కుడుములు, జొన్న రొట్టెలు, జంతికలు, ఉండలు చేసుకుంటారు గిరిజనులు. ఇప్పుడు ఆధునికులు కూడా ఇప్ప పూల శక్తి తెలుసుకుని వాటితో జామ్ కేక్ చేసుకుంటున్నారు.

Leave a comment