పట్టు,నేత వంటి ఖరీదైన చీరల తో పాటు మాచింగ్ బ్లవుజ్ ఇచ్చేస్తున్నారు. కనుక గొడవే లేదు.అందమైన చీర ఎంచుకుంటే సరి పోయేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందమైన బ్లవుజు డిజైన్ చేయిన్చుకున్నాకే చీర వైపు చూడటం. కట్టుకునే చీర అతి సాదా సీదా, లేత రంగు అయినా పర్లేదు బ్లవుజు అందాన్ని చీర ఏమి డామినేట్ చేయదు కదా.చీరకి బ్లవుజ్ తోనే అందంరావాలి. ఇప్పుడు ప్రతి స్పెషల్ అకేషన్ కి ప్రత్యేకంగా కనిపించి యునీక్ గా వుండే బ్లవుజ్ కావాలి.అందమైన డిజైనర్ బ్లవుజులు,లేస్ల అందం తో, ఎంబ్రాయిడరీ సగసు తో, రంగు రాళ్ళ మెరుపులతో మెడలో ఒక్క నగ కూడా  కనపడనంత జిగేల్ మంటూ వస్తున్నాయి. నిజానికి చెక్కని ప్లైన్ పట్టుకి ఈ మ్యాచింగ్ డిజైనర్ బ్లవుజ్ తోడు చేస్తే వేరే నగలు అవసరమే లేదు.

Leave a comment