Categories
Soyagam

ఇప్పుడిక వర్షం వచ్చినా పర్లేదు.

ఎంత బాగా మేకప్ చేసుకున్న నాలుగు వర్షపు చినికులు పడినా వెంటనే మేకప్ చెదిరిపోతుంది. ఇలా కాకుండా వుండాలంటే చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పలకు వేసుకునే ఐలైనర్, కాటుకా, పెన్సిల్, మస్కరా వంటివి వాటర్ ప్రూఫ్ తరహా ఎంచుకుంటే వర్షపు చినుకులకు అలంకరణ చేదిరిపోదు. ఫౌండేషన్ కుడా తడిస్తే ప్యాచ్ వేసినట్లు అయిపోతుంది. అందుకే ముఖానికి మాయిశ్చురైజర్ రాసుకుని తర్వాత కొద్దిగా ప్రైమర్ రాస్తే అప్పుడు ఫౌండేషన్ ముఖానికి అతికి వుంటుంది ముఖం జిడ్డుగా వుండదు. అలాగే పౌడర్ల రూపంలో వుండే అలంకరణ ఉత్పత్తుల కన్నా క్రీమ్ రూపంలో వుండే అలంకరణ ఉత్పత్తుల కన్నా క్రీమ్ రూపంలో వున్నవి ఎంచుకోవాలి. పెదవులకు లిప్ స్టిక్ వేసుకొనే ముందర పెన్సిల్ తో అవుట్ లైన్ వేసుకోవాలి. దాని పైన కాస్త పౌడర్ అద్దితే కనిపించకుండా వుంటుంది. ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే చాలు వర్షానికి అలంకరణ కరిగి పోకుండా వుంటుంది.

Leave a comment