Categories

ఇది ప్రాచీన కాలపు నగే అయినా మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కప్స్. కింద దుద్దులు పైకి చెవులను కప్పే కఫ్ రెండు కలిపే ఉంటాయి. ఇది బరువైన ఆభరణాలు కనుక చెవులకు హుక్ తో తగిలించుకుంటారు సాంప్రదాయ దుస్తులకు సరైన జోడి ఇది ఇలాంటి చక్కని ఇయర్ కప్స్ పెట్టుకుంటే మెడలో ఇంకే నగలు ఉండకూడదు. హెయిర్ స్టైల్ కూడా సెంటర్ బన్ వంటిది వేసుకొని జుట్టు చెవులను కప్పకుండా చూసుకోవాలి. చక్కని మ్యాచింగ్ గాజులు చేతినిండా వేసుకొని సాంప్రదాయ దుస్తులు ధరిస్తే వేడుక నేరుగా కనిపిస్తూనే ఉంటుంది.