కళ్ళజోడు కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ గా పరిగణిస్తున్నారు ఈ గాగుల్స్ ధరించిన అప్పుడు మేకప్ కూడా వాటికి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. కనురెప్పల పైన దిగువన ఐలైనర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. పై కనురెప్పలకు జెల్ ఐ లైనర్ అప్లై చేసి దిగువగా పౌడర్ ఐలైనర్ ఉపయోగించాలి. ముక్కుకు ఇరుపక్కల ప్రైమర్ అద్దుకోవాలి తాజా మస్కారా వాడాలి ఒకసారి మూత తెరిచి మస్కారా మూడు నెలలకు మించి వాడకూడదు. సైట్ ఉన్నవారు మేకప్ కోసం భూతద్దం కొనుక్కోవాలి. ఈ అద్దం దగ్గర ఉంటే మేకప్ తేలిక అవుతుంది. ఐబ్రో లు చక్కగా గ్రూమ్ చేసి ఐబ్రో పెన్సిల్ తో దిద్దుకోవాలి. కళ్లచుట్టూ ప్రదేశంలో తేలికగా చెమట పడుతూ ఉంటుంది కనుక మేకప్ చెక్కుచెదరకుండా సెట్టింగ్ స్ప్రే ఉపయోగించాలి.

Leave a comment