ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ కు ప్రత్యేక దూత గా ఎంపికైంది కెపి అశ్విని.ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు మొదట దళిత మహిళ కూడా కర్ణాటక కు చెందిన దళిత కుటుంబంలో పుట్టింది అశ్విని. ఢిల్లీ జె ఎస్ యు లో పిహెచ్ డి చేస్తూ దళిత విద్యార్థి విభాగంలో నాయకురాలుగా ఉంది అశ్విని.  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంలో ఛత్తిస్ గఢ్,ఒడిశా లోని ఆదివాసీ తెగల భూముల హక్కుల కోసం పోరాడింది ఆమె కృషి గుర్తించిన ఐక్యరాజ్య సమితి యు ఎన్ హెచ్ ఆర్ సి కు ప్రత్యేక దూతగా ఆమెను నియమించింది 36 ఏళ్ల అశ్విని జరియా స్వచ్ఛంద సంస్థ స్థాపించి భారత్ లో దళిత ముస్లిం మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తోంది.

Leave a comment