ఇరవై దాటిందంటే అమ్మాయి జీవితం ఒక కొత్త దశవైపు మొగ్గినట్లు ,ఇక చిన్నతనం అల్లరి తగ్గి కాస్త పెద్దరికం మొదలైంది అనుకొవచ్చు .వస్త్రధారణ కాస్త మారిపోవాలి . ప్యాబ్రిక్ , కలర్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి . ఫార్మల్, అకేషన్లు ,వీకెండ్స్ అని కాస్త విడదీసి వస్త్రధారణ ఎంచుకోవాలి .ముఖంలో లేతదనంతో పాటు ఆలోచనల్లో సీరియస్ నెస్ వస్తుంది. ఫార్మల్ డ్రెస్ లు నాణ్యమైన బ్యాగ్స్ హుందాతనం ఇస్తాయి. ఎలాంటి డ్రెస్ ఎంచుకొన్న ముందు నీటిగా ఇస్త్రీ చేసి ఉండాలి. ఎక్కుడ ముడత నలగని దుస్తులు ఎప్పుడు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. డెనిమ్ బ్రాండ్స్ ,స్కిన్నీ జీన్స్ బావుంటాయి.

Leave a comment