ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం నగరాల్లో నిరసించే గర్భవతుల్లో 40 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నారని తేలింది. ఈ ఎనీమియా ప్రారంభ దశలో వుంటే ఐరన్ మందుల రూపంలో తీసుకోవచ్చు పౌష్టికాహారం, విటమిన్-సి, విటమిన్-బి 12, ఫోలిక్ యాసిడ్ ల తో ఈ లోపాన్ని తగ్గించ వచ్చు. మాంసం, పచ్చని ఆకు కూరలు, తాజా కూరలు, బీన్స్, ఆపిల్, బెల్లం, పప్పు ధాన్యాలు,బ్రకొలి వంటివి తీసుకుంటే మేలు. ఇక విటమిన్-సి కోసం ఉసిరి, నిమ్మ, చీని, కమల, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, మొలకెత్తిన పెసలు వంటికి మంచివి. వీటితో ఎనేమియా లోపం వెంటనే తగ్గిపోతుంది. పచ్చని ఆకు కూరలు, కూరగాయలు, పులుపు పండ్లు, ఆరంజ్ జ్యూస్, బీన్స్, పప్పు ధాన్యాల వినియోగం పెంచాలి. విటమిన్ బి-12 కోసం సోయా ఆహార ఉత్పత్తులు, ఛీజ్, కోడి గుడ్లు, చికెన్ లివర్, మటన్, చేపలు, పితలు, తినాలి. ఐరన్ లోపం వస్తే రక్త హీనత సమస్య అంటున్నారు. గర్భినిలు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని సరైన ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలి.

Leave a comment