చాలా మంది నీరసం ,కళ్ళు తిరగడం ,జుట్టు ఊడిపోవటం,చర్మం జీవం లేనట్లు అయిపోవటం వంటి సమస్యలు చెపుతారు. రక్త హీనత వల్లనే ఆదంతా అంటారు డాక్టర్లు. ఐరన్ టాబ్లేట్స్ వేసుకోంటారు. మాంసాహారులతో పోలిస్తే శాఖాహారుల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది.  మాంసం,చికెన్ ,చేపల్లో శరీరంలోకి ఇంకనిదీ,ఇంకేదీ రెండు రకాల ఐరన్ ఉంటుంది. కాయగూరల్లో శరీరంలోకి ఇంకని ఐరన్ శాతం ఎక్కువ అలాంటప్పుడు నట్స్ విత్తనాలతో పాటు పాలకూర ,కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి.అలాగే తీసుకొనే ఐరన్ వంటికి పట్టేందుకు పండ్లు ,పప్పుధాన్యాలు ,పప్పు దినుసులు తినాలి.అప్పడే శరీరానికి సమృద్దిగా ఐరన్ అందుతోంది.

Leave a comment