Categories
బాగా ఇష్టమైన వ్యక్తి చేయి గట్టిగా ఇష్టంగా నమ్మకంగా పట్టుకుని నడిస్తే కార్డిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ చాలా సులభంగా విడుదలవుతుంది. ఒక చాక్లెట్ ముక్క కంటే ప్రేమ పూర్వకమైన స్పర్శ మంచి ప్రభావం కలది అంటున్నాయి అధ్యాయనాలు. బ్రిస్క్ వాక్ జాగింగ్ ఫీల్ గుడ్, ఎండార్ఫిన్ లను విడుదల చేస్తాయి. సంగీతం, మెదడుపైనా మంద్రమైన ప్రభావం చూపెడుతుంది. సరదాగా ఏదైన కార్టూన్ సినిమా చూసిన హాస్యభరితమైన పుస్తకం చదివినా కార్డిసల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ప్రకృతి వీక్షణం ఏకాగ్రత పెరగడానికి నాడీ వ్యవస్థకు ప్రశాంతత చేకుర్చేందుకు సహకరిస్తుంది.