Categories
చప్పగా ఉంటుందని పోట్లకాయ మనలో చాలా మందికి నచ్చదు కానీ వాటితో ఎన్నో రకాల మసాల కూరలు చెయ్యెచ్చు అంటున్నారు షెఫ్స్. అయితే ఇందులో బోలెడన్ని ఆరోగ్య ప్రయొజనాలున్నాయంటున్నారు వైద్యులు. వీటిలో నీటితో పాటు పీచు ఎక్కువ క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారు తరచు ఆహారంలో పొట్లకాయ తీసుకుంటే బరువు తగ్గడం ఈజీ అంటున్నారు. ఎన్నో పోషకాలు ఉంటాయి కనుక గుండె కి మంచిదంటారు. తేలికగా జీర్ణం అవుతుంది కాబట్టి వయసు మీరిన వాళ్ళకు,అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారికి మంచి ఆహారం అంటున్నారు.