తీయని పదార్థాలు తినడం అనారోగ్యం అని తెలిసినా మనసు లాగేస్తుంది.అలా తీపి తినాలి అనిపిస్తే బెల్లం, కిస్మిస్ లేదా ఖర్జూరపండు, అంజీర వంటివి తీసుకోవాలి అలాగే జీడిపప్పు వేరుశెనగపప్పు బెల్లంతో కలిపి తినొచ్చు. తీపి తినాలనే కోరిక తీరి, పోషకాలు అందటం జరుగుతుంది. వర్షాలు పడే సమయంలో నూనె వస్తువుల జోలికి వెళ్ళకుండా ఉడకబెట్టిన వేరుశెనగలు, ఉలవలు, సోయా తినొచ్చు. మరమరాల చాట్ తింటే మంచిది. అలాగే శీతల పానీయాలు తాగాలి అనిపిస్తే పండ్ల రసాలు చేసుకొని తాగటం.

Leave a comment