కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది.ఎన్ని లేపనాలు రాసిన ప్రయోజనం ఉండదు.అలాంటప్పుడు మాయిశ్చరైజర్ కు బదులు టోనర్ వినియోగించటం మంచిది.దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.అర కప్పు గ్రీన్ టీ డికాషన్ లో రెండు స్పూన్లు బియ్యం వేసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం దీన్నివడకట్టుకోవాలి.ఈ టోనర్ ని  మొహానికి రాసుకుని ఆరిపోయాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇందులోనే బియ్యం నీళ్లు గ్రీన్ టీ లోయాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ లో రెండు చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమంలో కాటన్ పాడ్ ముంచి ముఖాన్ని అద్దుకుంటే ఈ టోనర్ చర్మానికి మెరుపుని ఇచ్చి,వృద్యాప్య ఛాయలు దూరం చేస్తుంది.

Leave a comment