శీతాకాలంలో చాలా మందికి తలనొప్పి సమస్య వస్తుంది. ఈ సీజన్ లో ఎక్కువసేపు తలుపులు వేసుకొని పడుకోవడం వల్ల గదుల్లో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువవుతోంది. అదీ కాకుండా పగటి వేళలు తక్కువ కావటం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. గది తలుపులు వీలైనంత తెరిచి ఉంచాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు ఉపయోగించాలి. సమయానికి భోజనం చేయటం, నిద్రపోవటం, నీళ్లు త్రాగటం, డి-విటమిన్ ఎక్కువగా లభించే గుడ్లు, చేపలు తినడం మంచిది. తప్పకుండా ఓ అరగంట వ్యాయామం కూడా చాలా అవసరం.

Leave a comment