లాక్ డౌన్ లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ లతో జీవితం రోలర్ కోస్టర్ రైడ్ లా తయారైంది  ఇంట్లో నాలుగు గోడల మధ్య బందీగా గడపటం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఈ కాలాన్ని ఎదుర్కొనేందుకు ఎవరికి వాళ్లు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అంటున్నారు ఎక్సపర్ట్స్ . సోషల్ డిస్టెన్సింగ్  అని వాడతాం గానీ మనం పాటిస్తోంది ఫిజికల్ డిస్టెన్స్. ఇవ్వాల్టి వర్చువల్ యుగం లో ఏ మూల కూర్చొని అయినా ప్రపంచంలో ఎవరితోనైనా సంబంధాలు నెరపచ్చు. మనసులో టెన్షన్ లేకుండా స్నేహితులు, సహోద్యోగులు, బంధువులు ఆప్తులతో ఫోన్ వీడియో ఈ మెయిల్స్ తో ఈ సోషల్ డిస్టెన్సింగ్ కు ఒక ఎండ్ కార్డ్ వేయొచ్చు. అందరితో టచ్ లో ఉంటే ఎలాంటి మానసిక ఆందోళన భయం ఉండదు అంటున్నారు ఎక్సపర్ట్స్ .

Leave a comment