నా నలభైయ్యవ పుట్టిన రోజు తర్వాత అలోపేషియా అనే వ్యాధి వచ్చింది. మొత్తం జుట్టు రాలి పోయింది ఈ వ్యాధికి చికిత్స లేదన్నారు వైద్యులు మొదట్లో షాక్ అనిపించింది. అసలు ఈ గుండు తోనే అద్భుతాలు ఎందుకు చేయకూడదు అనుకున్నాను. 2017 లో మిస్ ఇండియా ఆఫ్ వరల్డ్ అందాల పోటీ జరిగింది అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.అప్లికేషన్ లో జుట్టు రంగు అని ఉన్నచోట ‘నో హెయిర్’ అని రాశాను గంటలోపే ఓకే అని సమాధానం వచ్చింది ఆ ఫోటోల్లో టాప్ టెన్ వరకు వచ్చాను అప్పుడిక ధైర్యం వచ్చింది అంటోంది గుజరాత్ కు చెందిన కెటాకీ జానీ. తరవాత మిస్సెస్ పీపుల్స్ చాయిస్ అవార్డు అందుకున్నప్పుడు ప్రపంచానికీ ఒక సందేశం ఇచ్చినట్లు అనిపించింది అంటోంది కెటాకీ జానీ. ప్రస్తుతం పూణే లో మహారాష్ట్ర స్టేట్ బ్యూరో ఆఫ్ టెస్ట్స్ బుక్ ప్రొడక్షన్స్ లో స్పెషల్ ఆఫీసర్ గా ఉంది కెటాకీ జానీ. నా నుంచి కొందరైనా స్ఫూర్తి పొందితే చాలు అంటుంది జానీ.

Leave a comment