ఇక ఈ నెల నుంచి నేరేడు పండ్లు విరివిరిగా వచ్చేస్తాయి. దీన్ని దేవుడి పండుగా పిలుస్తారు.అంటే ఎంతో ఆరోగ్యదాయినో తెలుసుకొవచ్చు. ప్రోటీన్లు ,విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సహాజ మౌత్ ఫ్రెషనర్స్. చిగుళ్ళ వ్యాధులను నిరోధిస్తాయి.ఇందులో సహజంగా ఉండే ఆమ్లాలు జీవక్రియకి తోడ్పడటం ద్వారా కాలేయం పనీ తీరుని మెరుగు పరుస్తుంది. పండ్లే కాదు ,ఆకులు,బెరడు,గింజలు,అన్ని మధుమేహానికి చక్కని మందులా పనిచేస్తుంది.నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి నీళ్ళలో మరిగించి కషాయం తాగితే మధుమేహాన్ని తగ్గిస్తుంది కూడా. గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకోవటం మంచిదే.

Leave a comment