Categories
ఆవనూనెతో అందాన్ని పెంచుకోవచ్చు అంటారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. ఆవాల్లో విటమిన్-ఇ ఉంటుంది ఇది చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.మంచి సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది.ఆవనూనెలో ఒక చెంచా శెనగపిండి కాస్త పెరుగు వేసి కలపాలి.ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం పై నల్ల మచ్చలు తగ్గిపోతాయి.చర్మం మృదువుగా ఉంటుంది. చర్మం నిర్జీవంగా అనిపిస్తే పావుకప్పు ఆవ నూనెలో రెండు చుక్కలు రోజ్ ఆయిల్ కలిపి దీనికి స్పూన్ బియ్యం పిండి కలిపి పేస్టులా చేయాలి.ఈ మిశ్రమంతో నలుగు పెట్టుకుంటే అది సహజమైన స్క్రబ్ లాగా పనిచేస్తుంది.మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంది.