ఎన్నో ఆశలను నింపుతూ కొత్త సంవత్సరం వచ్చింది నూతన సంవత్సరం లోకి ప్రవేశించే ముందు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలని చేసుకుంటారు అలా అలవాటు మార్చుకోగలమా? పూర్తిగా మానటం సాధ్యమా అంటే సాధ్యమే అంటుంది ఈ కథ. ఒక ధనవంతుడు తన కొడుకుని ఒక సాధువు దగ్గరకు తెచ్చి మా అబ్బాయి కొన్ని చెడు అలవాట్లు అలవర్చుకున్నాడు వాటిని తొలగించుకొనేలా గుణపాఠం చెప్పమని అడిగాడు. సాధువు ఆ అబ్బాయిని ఎదురుగా కనిపించే ఒక చిన్న మొక్క పెకలించమన్నాడు కుర్రవాడు తేలికగా దాన్ని లాగేసాడు ఇంకాస్త పెద్ద మొక్క ని చూపిస్తే శ్రమపడి లాగేసాడు. ఈసారి ఒక వృక్షాన్ని పెకలించమని చెబితే అది అసాధ్యం అన్నాడు అబ్బాయి అప్పుడు సాధువు నాయనా చెడు అలవాట్లు ఈ మొక్కలు లాంటివి ప్రారంభంలోనే తొలగించుకోగలము ముదిరితే వృక్షంలా గా అయితే దాన్ని పెకలించటానికి కష్టం అన్నాడు కుర్రవాడి మనసు మారింది వృక్షాన్ని తొలగించ లేకపోయాడన్నది  అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు నష్టం కలిగించే అలవాటును మానుకోవాలిని మనసు అర్థం చేసుకుంటే అది సులభమే.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134      

Leave a comment