ప్యాడ్ స్క్వాడ్ పేరుతో దాతల నుంచి లక్షల కొద్దీ శానిటరీ పాడ్స్ సేకరించి పంపిణీ చేసింది చిత్ర సుబ్రమణియన్ బాలీవుడ్ నిర్మాత సామాజిక కార్యకర్త చరిత్ర సుబ్రమణియన్ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన కార్పొరేట్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రిటర్న్ ఆఫ్ హనుమాన్ చిత్రాలకు నిర్మాత లాక్‌డౌన్‌ సమయంలో ముంబైలో స్త్రీల నెలసరి అవసరాలు తీర్చే పాడ్స్ ను పంపిణీ చేసింది. అలాగే మహిళ పోలీసుల టాయిలెట్ అవసరాల కోసం 20 వానిటీ  వ్యాన్ లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది మిషన్ సురక్ష పేరుతో ఈ వాన్ లు నగరంలోనే మూల  మూలకూ తిరుగుతూ మహిళా డాక్టర్లు నర్సులు పారిశుద్ధ్య సిబ్బంది పోలీస్ లు వీటిని ఉపయోగించుకొనేలా చేయటంలో చిత్ర సుబ్రమణియన్‌ పేరుతో విశేషంగా ప్రశంశలు పొందింది.

Leave a comment