ఆది పురుష్ హిందీ తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా ఇందులో నటించడం పెద్ద బాధ్యతగా ఫీలవుతున్నాను. సీతా మన దేశం ఆరాధించే స్త్రీమూర్తి కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న పాత్ర కాబట్టి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అంటోంది కృతి సనన్. సీత గురించి పూర్తిగా తెలుసుకొనేందుకు ఇండో అమెరికన్ రచయిత్రి చిత్ర బెనర్జీ దివాకరన్ రాసినది ది ఫారెస్ట్ ఆఫ్ ఎన్ ఛంట్ మెంట్ హిందీ లో సీతాయాణ్ చదువుకున్నాను. అది సీత కోణం నుంచి చెప్పిన రామాయణ గాధ .అప్పుడు సీత నాకు పూర్తిగా అర్థమైంది.సీత లా కనిపించేందుకు డైట్ కూడా కచ్చితంగా ఫాలో అవుతున్నాను అంటోంది కృతిసనన్.

Leave a comment