వంటింట్లో లభించే పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో చక్కని ఫేష్ వాష్ తయారు చేసుకోవచ్చు.ఖరీదైన ఫేస్ క్లీనర్స్ కంటే ఇది బాగా పనిచేస్తుంది., ఓట్స్ పొడి ముప్పావు కప్పు బాదం గింజల పొడి రెండు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్ పసుపు అర కప్పు శెనగపిండి లావెండర్ నూనె పది చుక్కల తో పేస్ క్లీనర్ తయారవుతోంది. ఈ పదార్ధాలన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ప్రతిరోజు ఒక స్పూన్  పొడి ముఖానికి రాసుకుంటే ముఖం చక్కగా ఉంటుంది ఓట్స్ పొడి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది.బాదం గింజల పొడి మృతకణాలను తొలగిస్తుంది.పసుపు చర్మానికి తాజాదనం ఇస్తుంది శెనగపిండి ముఖంపైన అదనపు నూనెను తొలగిస్తుంది లావెండర్ నూనె సువాసన ఇస్తుంది చర్మం పైన మచ్చల్ని పోగొడుతుంది.ఈ ఫేస్ క్లీనర్ ఎంతో సురక్షితమైనది.

Leave a comment