ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ భూగోళం పైన మొబైల్ ఫోన్ గురించి ఆలోచించిన అత్యున్నత సంకేతిక నిపుణురాలు పద్మశ్రీ ఒకరని ఆమె కితాబులు అందుకున్నారు. స్వయం బోదిత వాహనాల రూప కల్పన, ఎలక్ట్రిక్ కారు రూపకల్పనలో ఆమె పోషించిన పాత్రకు ఫోబ్స్ మేగజైన్ ఆమెకు ఆమెకు క్వీన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ బిజ్ అని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళల జాబితాలో పద్మశ్రీ ఒక్కరు.
Categories