ప్లాస్టిక్ ను నిషేదించమని ప్రపంచం మొత్తం ఘోష పెడుతోంది . మరి ఇప్పటి వరకు ఉపయోగించిన వ్యర్దాలు ఏమిటి ? ఎన్ని కోట్లా ప్లాస్టిక్ సీసాలు ,కవర్లు ,సామాగ్రి ఇదంతా ఏమైపోవాలి . ఇదిగో చూడండి మేం ఇలా వాడేం అంటున్నారు కెనడా ,నోవాస్కోడియా ప్రాంతాలలో జె. డి కంపోజిట్స్ అనే కంపెనీ వాళ్ళు . వాళ్ళు ఆరు లక్షల పన్నెండు వేల బాటిల్స్ కరిగించి చిన్ని గుళికలు చేసి వాటిని ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ప్రిపా బ్రికేటెర్ గోడలు గా మార్చేశారు . డిజైన్ ప్రకారం దాన్ని ప్లాస్టిక్ ఇల్లుగా కట్టేశారు . తుపానులను కూడా తట్టుకొని నిలబడ గలదట ఈ ప్లాస్టిక్ ఇల్లు . ఆ ఇంటిపేరు బాబ్ హౌస్ .

Leave a comment