అందమైన చీరకు జరీ ఉంటేనే నిండుతనం భారీతనం కనిపిస్తాయి.ఒకప్పుడు జరీ అంటే బంగారం లేదా వెండి మెరుపు.నాణ్యతను బట్టి జరీని నాలుగు రకాలుగా విభజించవచ్చు. స్వచ్ఛమైన జరీ బంగారు జరీ నే.1960 లో ప్రభుత్వం బంగారు వెండిని జరీ కోసం వినియోగించడాన్ని నిషేధించింది.రెండవది టెస్టెడ్ జరీ.ఇందులో రాగి తీగలు పైన బంగారు పూత పూస్తారు.మూడోరకం ప్లాస్టిక్ జరీ వెండి రాగి తీగ లకు బదులు ప్లాస్టిక్ తీగలు వాడతారు. ఇవ్ రిబ్బన్ లు, ఎంబ్రాయిడరీలు, లేసులు, అల్లికల్లో నీమ్ జరీ అన్నింటిలోకి  చవకగా తయారయ్యేది ప్లాస్టిక్ జరీ. బంగారు వెండితో తయారైన జరీ ని కాల్చితే బంగారము వెండో బయటపడుతోంది.టెస్టెడ్‌ జరీ కాల్చితే రాగి కనిపిస్తుంది. మిగతా జరీ లను కాల్చితే బూడిదే వస్తుంది. జరీ నాణ్యతను ఇలా కాల్చితే తెలుస్తుంది.

Leave a comment