ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. నాకు నటన అంటే ఇష్టం. నా ప్రతిభను నిరూపించుకునేందుకు చాలా ఏళ్ళు పట్టింది .బాలీవుడ్ లో ఎంట్రీ కి తొమ్మిది ఏళ్ళు పట్టింది అంటోంది శ్రేయ ధన్వంతరీ.ఈ హైదరాబాద్ అమ్మాయి మిస్ ఇండియా పోటీలతో మొదలు పెట్టి అగ్రశ్రేణి మోడల్ గా ఎదిగింది. తెలుగు లో  స్నేహ గీతం, హిందీ లో వై చీట్ ఇండియా సినిమాలతో  ప్రేక్షకులకు దగ్గరయింది . ది ఫ్యామిలీ మాన్ స్కామ్ 1992 వంటి  వెబ్ సిరీస్ లో నటించింది . ఢిల్లీ ముంబాయి ల మధ్య తిరుగుతూ మోడలింగ్ చేసే దాన్ని ఎన్నో ప్రముఖ సంస్థల ప్రచార చిత్రాల్లో పనిచేశాను ముంబై రావటం మంచిదైంది   అనుకుంటూ అంటోంది శ్రేయ ధన్వంతరీ.

Leave a comment