హోటల్స్ లో చేతుల కడుక్కొని చోట హ్యాండ్ డ్రయర్స్ అమర్చి ఉంటాయి .చేతుల తడులు కాకుండా అలా చేయి పెడితే వేడిగాలి వెదజల్లుతాయి ఈ హ్యాండ్ డ్రయర్స్ .కానీ వీటివల్ల పెద్దగా ఉపయోగం లేకపోగా, సూక్ష్మ జీవులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ అంటారు అధ్యయన కారులు .బాత్ రూమ్స్, టాయిలెట్స్, వాష్ బేసిన్స్ ఒకే చోట ఉంటాయి .అక్కడే సూక్ష్మ జీవులు అధికం .ఆ సూక్ష్మ జీవులు ఈ యంత్రాలు వదిలే గాలివల్ల మరింత దూరం వ్యాపిస్తాయి .మనుషుల చేతికి అంటుకొన్న సూక్ష్మ జీవులు ఈ గాలి కి మరొకరికి చేరి రోగాలను వ్యాప్తి చేస్తాయి .ఈ హ్యాండ్ డ్రయర్స్ విషయం లో కాస్త జాగ్రత్త అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment