ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇటీవల ఖద్దరు చెప్పులను విడుదల చేసింది.ఆగ్రాలోని అతిపెద్ద షూ తయారీ కంపెనీ దవార్ ప్రస్తుతం. 26 రకాల డిజైన్లతో ఇలాంటి పాదరక్షకులు ఉత్పత్తి చేస్తోంది.త్రిశూల్ గ్రూప్ అధినేత శృతి కౌల్ వీటిని డిజైన్ చేశారు. చెప్పులు ట్రెండ్ సెట్టర్స్ పెళ్లిళ్ల డ్రెస్ లకు ఖద్దరు బూట్లు సరిగ్గా సరిపోతాయి అంటున్నారూ శృతి కౌల్.చేతి తోనే నేసే ఖద్దరు కు  విదేశాలలో కూడా ఎంతో ఆదరణ ఉంది.ఇంతకుముందే ఖాదీ ఇండియా నుంచి ఖద్దరు వాచీలు వచ్చాయి.ప్రముఖ వాచీల బ్రాండ్ టైటాన్ ఈ ఏడాది ఆరంభంలో వీటిని విడుదల చేసింది.డ్రయిల్ స్ట్రాప్ లు కూడా ఖద్దరు తోనే చేశారు.స్త్రీ పురుషులకు నప్పే లా రెండు రకాల్లో వీటిని విడుదల చేశారు.

Leave a comment