కీప్ గర్ల్స్ ఇన్ స్కూల్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆడపిల్లలకు నెలసరి సమస్యల పై అవగాహన కార్యక్రమం మొదలు పెట్టింది యునెస్కో. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ తన వంతు మద్దతు ఇస్తోంది. మనదేశంలో 71 శాతం మంది ఆడపిల్లలకు మొదటి సారి నెలసరి వచ్చే వరకు దీని గురించిన అవగాహన ఉండదు. దాని తో గ్రామీణ ప్రాంత ఆడపిల్లలు ఈ నెలసరి సమస్య ఎలా ఎదుర్కోవాలో తెలియక రుతుస్రావం  అవుతున్నప్పుడు శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలియక స్కూలు మానేస్తున్నారు. ఇందులో ఎంతో మంది పిల్లలు భవిష్యత్ లో పైలెట్లు, డాక్టర్లు ఆయా దేశానికి ఉపయోగపడతారో తెలియదు అందుకే ఆడ పిల్లల్లో అవగాహన తేవటం నా బాధ్యత అనిపించింది అంటుంది భూమి పడ్నేకర్. ప్రతి సంవత్సరం రెండున్నర కోట్ల మంది అమ్మాయిలు ఈ నెలసరి సమస్యతోనే బడి మానేస్తున్నారని యునెస్కో అధ్యయనం చెబుతోంది.

Leave a comment