ఎంత కష్టపడినా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం లేదు అంటే  ఇంకోన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుందేమో చూసుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  చాలినన్ని ప్రోటీన్స్ తీసుకుంటున్నారో లేదోచెక్ చేసుకోవాలి. శరీరంలో లీన్ మజిల్స్ కోరుకున్నట్లయితే సరిపోయినన్ని ప్రోటీన్లు తీసుకోవాలి.  వారానికి రెండు సార్లు అయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవసరమని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.  నాజుగ్గా దృడంగా తయారవ్వాలి అనుకుంటే ఎమోషనల్ ఈటింగ్ అవాంతరం అవ్వకూడదు. ఫిట్ నెస్ లక్ష్యం నిర్ణయించుకున్నాక విభిన్న టేక్నిక్స్ అనుసరించి వ్యయామ కార్యకలాపాలు బోర్ కొట్టకుండా చూసుకోవాలి.  తిన్న ప్రతిదాన్ని నోట్ చేసుకుని ఫుడ్ జర్నల్ మెయిన్ టేయిన్ చేయాలి. క్యాలరీల పై కన్నేసి ఉండటం ఎంత అవసరమో కడుపు మాడ్చుకోవడం అంత అనవసరం. ఆకలేసినా తినకపోతే కొవ్వు నిల్వా ఉంచుకున్నట్లే.

Leave a comment