యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన సోషియాలజిస్ట్ బ్లూమ్ బర్గ్ ప్రపంచ వ్యాప్తంగా సూళ్ళలో పాఠాలు చేప్పేందుకు ఉపయోగించే పాఠన పుస్తకాలను పదేళ్ళుగా పరిశోధించారు. కొన్ని పాఠాలు లింగ అసమానాత్వాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆమె పేర్కోన్నారు.యునెస్కో పాఠ్య పుస్తకాల్లో కనించే అసమాత్వం బాలికల విద్యను నిర్లక్ష్యం చేయటంతో పాటు వారి వృత్తిపరమైన ,జీవనపరమైన ఆ కాంక్షలను కుదించివేస్తున్నాయని పేర్కొన్నది. అమ్మవంట చేటం,పిల్లల్ని చూసుకోవటం ,నన్ను ఉద్యోగం చేయటాన్ని మనదేశంలో చిన్న తరగతిలో పాఠ్యపుస్తకాల్లో ఉంది. భారతదేశంలో చిన్న తరగతిలో బోధించే చరిత్ర పాఠంలో ప్రధానమైన స్త్రీ పాత్ర ఒక్కటి కూడా లేదు.కెన్యాలోని ఒక పాఠ్యపుస్తకంలో పురుషులకు గొప్ప ఆలోచనతో ,మహిళలు బాలికలు అన్నం వండటం ,జుట్టు దువ్వేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉంది. ఈ వివక్ష బాలికల జీవితంపైన ప్రభావం చూపిస్తోందని యునెస్కో నివేదిక ప్రకారం ఇంకా ఆరుకోట్ల మంది పిల్లలు ఎన్నడు బడిలో అడుగు పెట్టకపోతే అందులో 54శాతం బాలికలే ఉన్నారని తేలింది.

Leave a comment