సూపర్ ఫుడ్ జాబితాలో అవకాడో ఉంటుంది. ఇవి ఖరీదు,ప్రతిచోట దొరకవు. అంచేత వీటితో సమానమైన గుణాలున్న కొన్ని పండ్లు కూరగాయాలు ఉపయోగించమంటున్నారు .అవకాడోల్లో అత్యధికమైన ఫ్యాట్ ఉంటుంది. ఇది ముఫా అంటే మంచి కొవ్వు అయితే చెర్రీలలో యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు ఉంటాయి. యాంతోసియాన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి గుండెను కాపాడుతాయి. క్యాన్సర్లు రానీయవు. దృస్టికి ప్రయోజనకరమైన బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.అవకాడో ఇచ్చే ప్రయోజనం పొందాలంటే కొబ్బరి ,ఉడికించిన పాలకూర, చెర్రీలు తీసుకొవచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లలో ఎమున్నాయో తెలుసుకొని అలాంటి లక్షణాలున్న ఇతర పండ్లను ,కూరలను వెతకటం మంచిది అంటారు పోసకహార నిపుణులు.

Leave a comment