Categories
పాపాయి పుట్టడం కంటే గొప్ప వేడుక ఇంకేమీ ఉండదు. ఈ మధ్యనే పాపను కన్నతల్లికి వాళ్లకు ఉపయోగపడే వస్తువు ను బహుమతిగా ఇస్తే బాగుంటుంది. అందులో బేబీ బౌన్సర్ ఒకటి ఇందులో పిల్లలను ఉంచితే హాయిగా నిద్ర పోతారు అలాగే బేబీ హ్యాండ్ ప్రింట్, ఫుట్ ప్రింట్ కిట్ కానుకగా ఇస్తే పిల్లల చేతి, కాలి ముద్రలను ఫోటో ప్రేమలుగా మలిచి దానిని అపురూపంగా చూసుకుంటారు. అలాగే నిబ్లెర్ పాసిఫైయర్ లో పిల్లల ఆహారం రుచి మారుతుంది. కొత్త రుచులు ఆస్వాదించటం నేర్చుకొంటారు. ముఖ్యమైంది బేబీ స్లింగ్ ఇందులో పసి పిల్లలను కూర్చోబెడితే ఏ సమస్య రాదు. చాలా సురక్షితమైనది కూడా. ఇలాటి బహుమతులు కొత్తగా తల్లిదండ్రులైనా వారికి ఎంతో ఉపయోగం.